Header Banner

సెర్ప్‌కు 25 ఏళ్లు.. చంద్రబాబు ప్రశంసలు! సీఎం ట్వీట్ ఇదే..

  Mon Jun 16, 2025 20:31        Politics

గ్రామాల ఆర్థిక అభివృద్ధి కోసం, గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)ను మహిళలు ఓ ఉద్యమంలా తీసుకెళ్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కొనియాడారు. తొలుత వెలుగు అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టగా.. అది కాలక్రమేనా సెర్ప్‌గా రూపాంతరం చెందిందన్నారు. సెర్ప్‌ను తీసుకొచ్చి నేటికి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గ్రామీణ మహిళలకు, సెర్ప్ ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉట్నూరు అనే ఒక మారుమూల ప్రాంతంలో వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను.

 

ఇది కూడా చదవండి: అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యంతో గ్రామాల ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆనాటి ప్రాజెక్టు లక్ష్యం. అది కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోంది. సెర్ప్ కార్యకలాపాలలో భాగస్వాములవుతూ... నవసమాజ నిర్మాతలై గ్రామీణ పేదరిక నిర్మూలనను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్న గ్రామీణ మహిళలకు... వారిని ప్రగతి పథంలో నడిపిస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations #25Year #Rural Women #Development #